Dec 11, 2025, 14:12 IST/
సర్పంచ్ ఎన్నికలు... మంత్రి తుమ్మలకు షాక్
Dec 11, 2025, 14:12 IST
TG: మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ షాక్ తగిలింది. మొత్తం 37 గ్రామ పంచాయతీలకు గాను 32 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 10 సీట్లు గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో రెబెల్స్ బెడద, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వంటి కారణాలతో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.