వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించామని సీఐ వీరప్రసాద్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 50 మందికి జైలు శిక్ష, జరిమానాలు విధిస్తూ మేజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామన్నారు.