రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వాతావరణం చల్లబడటంతో ప్రజలు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు.