వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు భారత పౌరుడు కాదంటూ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన న్యాయపోరాటం గత కొద్ది రోజుల క్రితం ఫలించింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రెవెన్యూ అధికారులు రమేశ్ బాబు ఓటుహక్కును తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేయడాన్ని వేములవాడ రూరల్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం గౌడ్ స్వాగతించారు. చెన్నమనేని కుటుంబానికి ఒక మాయని మచ్చ అని విమర్శించారు