బోయినపల్లి: రూ. 600 రోజువారి కూలీ ఇవ్వాలి

77చూసినవారు
బోయినపల్లి: రూ. 600 రోజువారి కూలీ ఇవ్వాలి
బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను మంగళవారం కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో పెరిగిన ధరలకు అనుకూలంగా ఇచ్చే కూలి ఏదైతే ఉందో అది ఏమాత్రం సరిపోవటం లేదని వాపోతున్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజువారి కూలీ రూ. 600 చెల్లించాలని సీపీఎం పార్టీ పక్షాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్