సిరిసిల్ల: జైలు నుంచే సర్పంచ్ ఎన్నికల బరిలోకి..!

6చూసినవారు
సిరిసిల్ల: జైలు నుంచే సర్పంచ్ ఎన్నికల బరిలోకి..!
వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామానికి చెందిన బూర బాబు, ఆర్థిక వివాదం కేసులో జగిత్యాల జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ, జైలు నుంచే సర్పంచ్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, సన్నిహితుల సహాయంతో ఆయన నామినేషన్ సమర్పించగా, అధికారులు దానిని ఆమోదించారు. ఈ సంఘటన గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్