గురుపౌర్ణమి సందర్భంగా గురువారం వేములవాడ పట్టణంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్ స్కూల్ లో గురువులకు సన్మానం చేసి గౌరవించారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ భాజాపా రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ గోపు బాలరాజుల ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.