
థాయ్‌లాండ్ ఓపెన్‌లో సింధు, లక్ష్యసేన్, శ్రీకాంత్ బోణీ
బ్యాంకాక్‌లో బుధవారం జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-500 టోర్నీలో భారత షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ బోణీ చేశారు. మహిళల సింగిల్స్‌లో సింధు, దేవిక సిహాగ్, మాళవిక బన్సోద్ గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, శ్రీకాంత్ కూడా తమ తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. అయితే, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, అన్మోల్ ఖర్బ్ ఓటమి పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్‌లో అశిత్ సూర్య-అమృత ప్రథమేశ్, రోహన్ కపూర్-రుత్విక శివాని జంటలు ఓడిపోయారు.




