ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రణాళికలను రూపొందించాలని మరియు వాటి అమలుకై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారు స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో అల్ఫోర్స్ విద్యాసంస్థలు మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు రెనీ హాస్పిటల్ వారి సంయుక్త సహాకారంతో ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి సిపిఆర్ ప్రదర్శన & శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేడుకను ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తాయని చెప్పారు. గుండె జబ్బుల వల్ల కలిగే ప్రమాదాలు గురించి ప్రజలకు తెలియజేయడం మరియు నివారణ చర్యలను వివరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వారు చెప్పారు.
రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా నడవడం ద్వారా గుండెను జాగ్రత్తగా ఉంచుకోవచ్చని తెలిపారు. యోగా ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని మరియు గుండెను కాపాడుకోవచ్చని చెప్పారు.
డాక్టర్ బంగారి స్వామి గారు, చైర్మన్, రెనీ హాస్పిటల్స్ మాట్లాడుతూ* ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని గుండె జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజున వివిధ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తారని వారు చెప్పారు.
అల్ఫోర్స్ విద్యా సంస్థల వారితో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయమని మరియు అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
సిపిఆర్ విధానాన్ని డాక్టర్ బి.దీక్షిత్ చాలా చక్కగా వర్ణించాడు. వార్షిక ప్రణాళికలో భాగంగా దీనిని పొందుపరచాలని వారు అభిప్రాయపడ్డారు మరియు ప్రభుత్వానికి సూచించారు.ఈ విధానం ద్వారా ఎంతో మంది జీవితాలను కాపాడవచ్చని వారు చెప్పారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బంగారు స్వామి, చైర్మన్, రెనీ హాస్పిటల్స్, డాక్టర్ ఆకుల శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షురాలు, డాక్టర్ ఎన్.మహేష్ బాబు, కార్యదర్శి, ఐఎంఏ కరీంనగర్, డాక్టర్ వి.నీలిమ, కోశాధికారి, ఐఎంఏ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బి.దీక్షిత్, డాక్టర్ సారంగ్, ఆచార్య వడ్లూరి శ్రీనివాస్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు SRR డిగ్రీ అండ్ పీజీ కళాశాల, కరీంనగర్, ఎం అరవింద్ బాబు, ప్రతినిధి - రెనీ హాస్పిటల్స్, పవన్ ప్రసాద్, జనరల్ డైరెక్టర్ - రెనీ హాస్పిటల్స్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు
విద్యార్థులు పాల్గొన్నారు.