కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య–డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి పై ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్నారని సమాచారం. రాహుల్ విదేశాల్లో ఉండగా నాయకత్వ మార్పుపై ఊహాగానాలు పెరిగి, డీకేకు ఆయన ‘వేచి చూడండి, నేను కాల్ చేస్తా’ అని స్పందించినట్లు ప్రచారం. డీకే త్వరలో దిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలవాలని చూస్తుండగా, డిసెంబర్ 1న పార్లమెంట్ సమావేశాల నాటికి ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్య వర్గం మార్చి వరకు మార్పు వద్దని భావిస్తుండగా, డీకే శిబిరం వెంటనే బాధ్యతలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోంది.