కర్ణాటక రాష్ట్ర ప్రణాళిక, గణాంకాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. పరిశిష్ట తెగల అభివృద్ధి సంస్థలో చోటుచేసుకున్న నిధుల మళ్లింపు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. అధిష్టానం పిలుపు మేరకు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.