
తీవ్ర విషాదం.. ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతి
TG: గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఫ్రిజ్ పేలడంతో తల్లి, కొడుకు మృతి చెందారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ, ఆమె కొడుకు తుదిశ్వాస విడిచారు. ఫ్రిజ్‌ను గోడకు తగినంత దూరంలో ఉంచడం, సరైన వెంటిలేషన్, వైరింగ్, ప్లగ్స్ వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.




