హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం బుధవారం (అక్టోబర్ 22) నుంచి ప్రారంభమైంది. కార్తీక మాసం పరమేశ్వరునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసం ఎంతో విశిష్టమైనదని స్కంధ పురాణంలో ఉంది. ఈ మాసం అంతా భక్తులు పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేపడుతారు. ఈ పవిత్ర మాసంలోనే వనభోజనాలు జరుపుకుంటారు. కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తే స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుందని, మరో జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు.