యంగ్ టైగర్
ఎన్టీఆర్, దర్శకధీరుడు
రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయతో తన అనుబంధం గురించి `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` ప్రీ-రిలీజ్ వేడుకలో మాట్లాడారు. తన కెరీర్ కష్టకాలంలో కార్తికేయ అండగా నిలిచాడని, తన ముఖంలోని ప్రతి చిరునవ్వు వెనుక అతడున్నాడని
ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లికి మరో బిడ్డ పుట్టి ఉంటే అది కార్తికేయనే అయి ఉండేవాడని, అంతలా తనకు దగ్గరయ్యాడని తెలిపారు. కార్తికేయ తొలి నిర్మాతగా వస్తున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు.