
భార్యాపిల్లలు ఉండగా బాలికతో ఎఫైర్.. కొట్టి చంపేశారు!
TG: ములుగు(D) ఏటూరు నాగారం(M) లాలాయగూడ గ్రామంలో జాడి సమ్మయ్య (40) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న సమ్మయ్య, లాలాయగూడెంకు చెందిన 16 ఏళ్ల బాలికతో వివాహేతర సంబంధం పెట్టుకుని మద్యానికి బానిసైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం బాలిక గ్రామానికి రాగా.. ఆమె బంధువులు మాటువేసి పట్టుకుని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




