ఇవాళ కార్తీక పౌర్ణమి. 'తెల్లవారుజామున 4.52-ఉ.5.44 మధ్య నదీ స్నానం చేయాలి. వెంటనే కార్తీక దీపాలు వదలాలి. ఉపవాసం ఉండాలి. ఆహారం తీసుకోకుండా ఉండలేనివారు పాలు, పండ్లు తీసుకోవాలి. సత్యనారాయణస్వామి కథ వినడం లేదా చదవడం శుభప్రదం. సాయంత్రం శివాలయాలు, విష్ణు మందిరాల్లో 365 వత్తులతో దీపారాధన చేయాలి. దీపారాధన తర్వాత ఉపవాసం విరమించాలి' అని పండితులు చెబుతున్నారు.