టీవీకే పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై నటి, బీజేపీ నేత ఖుష్భూ స్పందించారు. తొక్కిసలాట ఘటన ప్లాన్/క్రియేట్ చేసిన ప్రమాదమని ఆరోపించారు. తొక్కిసలాట నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రజలు నమ్ముతున్నారని, ఇది సృష్టించిన విపత్తులా కనిపిస్తోందన్నారు. విజయ్ కోసం ఎంతమంది జనం వస్తారో ప్రభుత్వానికి తెలిసినా ర్యాలీకి సరైన స్థలం కేటాయించలేదని, సీఎం మౌనం వీడి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.