కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన.. ఆలయం మూసివేత

1చూసినవారు
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన.. ఆలయం మూసివేత
AP: తొక్కిసలాట జరిగిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని అధికారులు శనివారం మూసివేశారు. ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పండాను గృహ నిర్బంధంలో ఉంచి.. పోలీసులు పహారా కాస్తున్నారు. అటు తొక్కిసలాటపై విచారణ కొనసాగుతోంది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. కాగా, ఈ ఘటనలో 9 మంది చెందిన విషయం తెలిసిందే.