అయోధ్య రామాలయంలో కాశ్మీర్ కు చెందిన అహ్మద్ షేక్ (55) అనే వ్యక్తి సీతా రసోయి వద్ద నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దేవాలయంలోకి ప్రవేశం, భద్రతను దాటడంపై విచారణ జరుపుతున్నారు. అతని ట్రావెల్ హిస్టరీని కూడా పరిశీలిస్తున్నారు. మకర సంక్రాంతి వేడుకలకు రామాలయం సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన కలకలం రేపింది.