కశ్మీర్ వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చైర్మన్ అబ్దుల్ గనీ భట్ (90) బుధవారం కన్నుమూశారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బారాముల్లా జిల్లా సోపోర్‌లోని ఇంటిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఇంటికే పరిమితమైన గనీ, గతంలో ఎన్‌డీఏ, యూపీఏ ప్రభుత్వాలతో హురియత్ చర్చల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపై జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు.