తెరుచుకున్న కాఠ్‌మాండూ ఎయిర్‌పోర్టు..!

16357చూసినవారు
తెరుచుకున్న కాఠ్‌మాండూ ఎయిర్‌పోర్టు..!
నేపాల్‌లో యువత నిరసనలు హింసాత్మకంగా మారడంతో అన్ని ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. అయితే బుధవారం కాఠ్‌మాండూ త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి విమాన సేవలు ప్రారంభమైనట్లు పౌర విమానయాన అధికారులు తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనల నడుమ పలు జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్