TRS పేరుతో కవిత పార్టీ.. బీఆర్ఎస్‍కు బిగ్ షాక్!

22చూసినవారు
TRS పేరుతో కవిత పార్టీ.. బీఆర్ఎస్‍కు బిగ్ షాక్!
TG: 'టీఆర్ఎస్' పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే జరిగితే బీఆర్ఎస్‍కు భారీ షాక్ తగలనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్‍లో ఉన్న అసంతృప్త నేతలంతా కవిత పార్టీలోకి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్‍లో అవకాశాలు దక్కని వారంతా కవిత వెంట నడిస్తే అది గులాబీ పార్టీ ఓటు బ్యాంకుపై భారీగా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. కవిత పార్టీ ఏర్పాటుతో ఎవరికి లాభం చేకూరుతుందో త్వరలో తెలనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్