TRS' పేరు మార్పు పై స్పందించిన కవిత

8919చూసినవారు
TRS' పేరు మార్పు పై స్పందించిన కవిత
TG: 'TRS' పార్టీ పేరును 15 రోజుల్లోగా మార్చుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈసీ నుంచి తమకు అందిన రెండు అభ్యంతరాలకు ఇప్పటికే సమాధానం ఇచ్చామని, తమ పార్టీ పేరు TRS అని వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్లుగా తాము కొత్త పేర్లు ఇచ్చేది లేదని ఆమె స్పష్టం చేశారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధంగానే ఉన్నామని కవిత పేర్కొన్నారు. TRS పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి వెళుతున్న కవితకు ఈ పరిణామంతో బిగ్ షాక్ తగిలినట్లయింది.

సంబంధిత పోస్ట్