కవిత TRS పార్టీ.. KCR రేపు మాట్లాడతారా?

12చూసినవారు
కవిత TRS పార్టీ.. KCR రేపు మాట్లాడతారా?
TG: రేపు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా KCR ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. కాగా కేసీఆర్ కూతురు కవిత తన సొంత రాజకీయ పార్టీ 'తెలంగాణ రాష్ట్ర సేన'(TRS)ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్, కవిత పార్టీపై ఏదైనా మాట్లాడుతారా అనేది ఆసక్తిగా మారింది. BRS పేరును TRSగా మార్చేందుకు ఆలోచిస్తున్నామంటూ ఇటీవల KTR చెప్పారు. ఈ లోపే కవిత TRS పేరుతో పార్టీని ప్రకటించడం చర్చనీయాంశం అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్