కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదు: ఎంపీ చామల

0చూసినవారు
తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయనకు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం అంటూ లబోదిబోమంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌కు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రాయిల్ నుంచి పరికరాలు కొనుగోలు చేస్తారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరిని ఎదగకుండా చేద్దామని కుట్ర చేశారని, ఆధారాలు చెరిపివేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకు వస్తుందా అని మండిపడ్డారు.

ట్యాగ్స్ :