TG: బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టిండని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయనను జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. నవీన్ యాదవ్ గెలుపునకు తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసిందని సెటైర్లు వేశారు. పొరపాటున కారు గుర్తుకు ఓటేస్తే అది కమలం గుర్తుకు వేసినట్లేనని అన్నారు.