TG: నాని నటించిన ప్యారడైజ్ మూవీపై
కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, గొంతును ఇచ్చిన నాయకున్ని, ఒక జాతిని మేలుకొలిపిన నాయకున్ని తెలంగాణ ఎలా యాది చేసుకుంటున్నదో సినిమాలో చక్కగా చూపించారని పేర్కొన్నారు. ప్యారడైజ్ సినిమా ఒకెత్తు అయితే, ఆ సినిమాలో
కేసీఆర్ వచ్చిన 4 నిమిషాలు ఒకెత్తు అని మంత్రి
కేటీఆర్ అన్నారు. పోయింది అధికారం మాత్రమేనని, ప్రజల్లో
కేసీఆర్ మీద మమకారం, అనురాగం అలానే ఉందని ఆయన పేర్కొన్నారు.