TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిన్ననాటి గురువు నక్కల పున్నారెడ్డి మంగళవారం ఉదయం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణవార్తతో పలువురు సంతాపం తెలిపారు. పున్నారెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించేందుకు ఆత్మీయులు పెద్దగుండవెల్లికి తరలివస్తున్నారు.