తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. అధికార
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుగా బీఆర్ఎస్ తన వ్యూహాలను పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో మే 6న వరంగల్‌లో ‘రైతు ఆశీర్వాద సభ’ నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ సభకు మాజీ సీఎం
కేసీఆర్ హాజరుకానున్నారు. మొత్తంగా
కేసీఆర్ ఫామ్ హౌజ్ వదిలి ఫుల్ పొలిటికల్ ఫామ్‌లోకి రానున్నారు. ఇదిలా ఉండగా
కాంగ్రెస్ రైతు హామీలను అమలు చేయలేదని
కేటీఆర్ విమర్శించగా, ప్రభుత్వం తమ ఫోన్లు, సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తోందని హరీశ్‌రావు ఆరోపిస్తున్నారు.