కేసీఆర్ దీక్ష నాటకం: తెలంగాణ సోనియా గాంధీ వల్లే వచ్చింది: టీపీసీసీ చీఫ్

7091చూసినవారు
కేసీఆర్ దీక్ష నాటకం: తెలంగాణ సోనియా గాంధీ వల్లే వచ్చింది: టీపీసీసీ చీఫ్
బీఆర్ఎస్ చేపట్టిన దీక్షా దివాస్‎పై గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‎ను వాడుకుని, ఉనికి కోసం మళ్లీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ దీక్ష కేవలం నాటకమని, 3 రోజులకే విరమించారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్షకు, పొట్టి శ్రీరాములు దీక్షకు పొంతన లేదన్నారు. కేవలం కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ రాలేదని, కాంగ్రెస్, సోనియా గాంధీ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్