కవిత వ్యాఖ్యలపై KCR మౌనం.. కారణం ఇదేనా?

13చూసినవారు
కవిత వ్యాఖ్యలపై KCR మౌనం.. కారణం ఇదేనా?
TG: కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టినప్పుడు చేసిన వ్యాఖ్యలపై KCR మౌనం పాటించడం BRSలో తీవ్ర చర్చకు దారితీసింది. కొత్త పార్టీ ప్రారంభంలో కవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినా, పార్టీ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కీలక సమావేశంలోనూ కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. నేతలు స్పందించవద్దని పైనుంచి ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. ఈ మౌనం వెనుక వ్యూహమా? లేక అంతర్గత విభేదాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. KTR పరోక్షంగా స్పందించినా స్పష్టత ఇవ్వకపోవడంతో కేడర్‌లో అయోమయం కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్