TG: కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో నందినగర్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. భద్రతను కఠినంగా పాటిస్తూ, పరిసరాల్లో డ్రోన్‌లతో పర్యవేక్షణ చేస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ నివాసానికి చేరుకోకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సిట్ విచారణ సమయంలో కేసీఆర్ మాత్రమే గదిలో ప్రవేశించే అవకాశం ఉండగా, కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించారు. ఈ నేపథ్యంలో పోలీసుల డ్రోన్ పర్యవేక్షణ కీలకంగా మారింది.