కేసీఆర్ సిట్ విచారణ.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత (వీడియో)

70చూసినవారు
TG: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌పై సిట్‌ విచారణను వ్యతిరేకిస్తూ తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కేసీఆర్‌ను అక్రమంగా ఇరికించి విచారణ పేరుతో వేధిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టి బొమ్మను ఉరి తీసి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్