రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై మౌనంగా ఉన్న BRS చీఫ్ KCR త్వరలో పూర్తిస్థాయిలో యాక్టివ్ కానున్నట్లు తెలుస్తోంది. ఆయన ఏప్రిల్‌లో ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. త్వరలో జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయా రాష్ట్రాల రాజకీయ మిత్రులను కలుస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతా బెనర్జీ, పినరయ్ విజయన్‌లతో KCRకు మంచి సంబంధాలున్నాయి. ఢిల్లీలో BRS కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శిస్తారు.