ఫామ్‌హౌస్ వీడనున్న కేసీఆర్.. త్వరలో బస్సు యాత్ర!

28చూసినవారు
గత కొంతకాలంగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. వరుస ఎన్నికల పరాజయాలతో నిరాశలో ఉన్న పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపడం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది. కేసీఆర్‌ బస్సు యాత్రకు సంబంధించి అన్ని జిల్లాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్‌ను పార్టీ ముఖ్య నేతలు ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. సభ్యత్వ నమోదు సమావేశాలు కొనసాగుతున్నాయని, యాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే కేసీఆర్ స్వయంగా ప్రకటించనున్నారు.

సంబంధిత పోస్ట్