నటి కీర్తి సురేశ్ తమ వివాహ తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. పెళ్లి వేడుక జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంథోనీతో కీర్తి వివాహం గతేడాది డిసెంబరు 12న జరిగింది. ఈ సందర్భంగా ఆమె తన వివాహ వేడుక ఎంత సందడిగా జరిగిందో తెలియజేస్తూ ఈ వీడియోను విడుదల చేశారు.