TG: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో కీసర పీఎస్ పరిధిలోని నాగారంలో పట్టపగలు ఓ బంగారం షాపులో దారుణం జరిగింది. ఇద్దరు దుండగులు నకిలీ తుపాకీతో బెదిరించి, రాడ్డుతో యజమానిపై దాడి చేసి, బంగారం, డబ్బు దోచుకుని పారిపోయారు. యజమానికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నకిలీ తుపాకీని స్వాధీనం చేసుకుని, సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు ముఖాలకు మాస్కులు, హెల్మెట్లు ధరించి ఉన్నారు.