
వాట్సాప్ లో ట్రిపుల్ తలాక్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బసేరా గ్రామంలో హసన్ అనే భర్త, తన భార్య అస్మాను వరకట్నం కోసం వేధించి, వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా చట్టవిరుద్ధంగా మార్చి 31 2025న ట్రిపుల్ తలాక్ చెప్పాడు. వీరికి 2017లో వివాహం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త కుటుంబికులపై సెప్టెంబర్ 28న ఎఫ్ఐఆర్ నమోదు చేసి వరకట్న నిషేధ చట్టం, ముస్లిం మహిళలచట్టం, 2019 సెక్షన్ల కింద కేసు నమోదు కాగా అందరు పరారీలో ఉన్నారు. ట్రిపుల్ తలాక్ నిషేధించిన విషయం తెలిసిందే.




