మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కేరళ ప్రభుత్వం ప్రకటించిన 55వ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. త్రిస్సూర్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో సాంస్కృతిక మంత్రి సాజి చెరియన్ ఈ అవార్డులను ప్రకటించారు. 'భ్రమయుగం' చిత్రంలో 'కొడుమన్ పొట్టి' పాత్రలో మమ్ముట్టి నటనకు గాను ఈ పురస్కారం దక్కింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.