మహారాష్ట్రలోని పుణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో తాజాగా ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. జూన్ 19న తనకు కాబోయే భార్య సియా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు వినూత్న సర్ప్రైజ్ ఇచ్చేందుకు కేతన్ తన వీపుపై ఆమె పేరును టాటూగా వేయించుకున్నాడు. ఈ వ్యక్తిగత బహుమతిని ఇచ్చేలోపే అతను దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసులు ఈ కేసును పరిగణించి అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య సంబంధించి పోలీసులు ఇటీవల 5,053 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు