పుణెలోని కేతన్ అగర్వాల్ హత్యకేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధరి 2025 డిసెంబరులో రాజస్థాన్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఫోన్ల నుంచి లభించిన ఓ ఫొటోలో ఇద్దరూ దండలు ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫొటోను 5,053 పేజీల ఛార్జ్‌షీట్‌కు జత చేశారు. వివాహాన్ని ధ్రువీకరించే అధికారిక రికార్డులు, సీసీటీవీ ఆధారాలు లభించకపోయినా.. వీరిద్దరూ స్నేహితులతో కలిసి రాజస్థాన్ వెళ్లిన ఆధారాలను పోలీసులు సేకరించారు.