పుణేలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. కేతన్ ను అంతమొందించేందుకు అతని ప్రియురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి, చాట్‌జీపీటీ, మర్డర్ సినిమాలు, సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారని పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. ఈ ఏడాది జూన్ 18న లోహగడ్ కోటపై నుంచి తోసివేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. శనివారం 5,053 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.