కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎనిమిదో వేతన సంఘంపై ఎన్నో ఆశలు పెట్టుకోగా నిరాశే మిగిలింది. ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న డియర్‌నెస్ అలవెన్స్ (DA) లేదా డియర్‌నెస్ రిలీఫ్ (DR)ను బేసిక్ పేలో విలీనం చేసే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌లో స్పష్టం చేశారు.