
బోటు ప్రమాదం.. కన్నకొడుకును కౌగిలించుకుని ప్రాణాలు వదిలిన తల్లి
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో శుక్రవారం బార్గి డ్యామ్ జలాశయంలో 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న క్రూయిజ్ బోటు తుపాను కారణంగా బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ప్రమాదంలో ఒక తల్లి తన నాలుగేళ్ల కొడుకును గట్టిగా పట్టుకుని కనిపించిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. 22 మందిని సురక్షితంగా బయటకు తీయగా, మరికొందరు గల్లంతయ్యారు. బోటులో భద్రతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర మంత్రి రాకేష్ సింగ్ కూడా ఈ సంఘటనతో తీవ్రంగా చలించిపోయారు.




