
కారులో మంటలు.. ఐదుగురు సజీవదహనం
రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ హైవే పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఐదుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక మైనర్ బాలిక ఉన్నట్లు తెలుస్తోంది. వైష్ణోదేవి దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.




