ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


రెండేళ్ల చిన్నారి అదృశ్యం.. బంధువుల అనుమానం!
Jul 07, 2026, 00:07 IST/

రెండేళ్ల చిన్నారి అదృశ్యం.. బంధువుల అనుమానం!

Jul 07, 2026, 00:07 IST
AP: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్‌ అగ్రహారంలో గతనెల 6న అదృశ్యమైన రెండేళ్ల జ్ఞానేశ్వరి ఆచూకీ నెలరోజులైనా లభించలేదు. చిన్నారి కనిపించకుండా పోయిన సమయంలో.. అదే గ్రామంలో తిరిగిన ఓ కారుపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అదే కారుతో తనను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారని జ్ఞానేశ్వరి చిన తాతయ్య కోటేశ్వరరావు ఆరోపించారు. ఈ సంఘటనలతో చిన్నారి అదృశ్యానికి కారులో తిరుగుతున్న వ్యక్తులకు సంబంధం ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవంలేదని, వేర్వేరు కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.