పండుగ సీజన్ వేళ వంటనూనెల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముడి పొద్దుతిరుగుడు నూనెపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి సున్నాకు, ముడి సోయాబీన్, పామాయిల్‌పై 10 నుంచి 5 శాతానికి తగ్గించింది. శుద్ధి చేసిన నూనెలపైనా సుంకాలను తగ్గించింది. సెప్టెంబర్ 24 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. తగ్గిన దిగుమతి వ్యయ ప్రయోజనాలను వినియోగదారులకు అందేలా వంటనూనె పరిశ్రమలు వెంటనే PTD, MRPలను సవరించాలని కేంద్రం సూచించింది.