కేంద్రం కీలక నిర్ణయం.. 'సార్థక్ పీడీఎస్' పథకం ఐదేళ్లు పొడిగింపు

0చూసినవారు
రేషన్ పంపిణీ వ్యవస్థపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సార్థక్ పీడీఎస్ పథకాన్ని మరో ఐదేళ్లు (2031 మార్చి వరకు) కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన అమలును మరింత బలోపేతం చేసేందుకు 'సార్థక్ పీడీఎస్' స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. ఎఫ్‌సీఐ గోదాముల నుండి రేషన్ షాపుల వరకు ధాన్యం రవాణా ఖర్చులను ఇకపై కేంద్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.25,530 కోట్లు కేటాయించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్