AP: శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. చెంచు గిరిజనులకు, భక్తులకు శుభవార్త ట్రస్ట్ బోర్డు శుభవార్త చెప్పింది. శ్రీశైలంలో నివసించే చెంచు గిరిజనులకు ప్రతి నెల చివరి వారంలో ఒకరోజు ఉచితంగా స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనుంది. అలాగే రూ.500 టికెట్ పొందిన భక్తుడికి రెండు లడ్డూలు, రూ.300 టికెట్ పొందిన భక్తుడికి ఒక లడ్డు ఉచితంగా ఇచ్చేలా ఆమోదం తెలిపింది.