భారత్-అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం

87చూసినవారు
భారత్-అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం
భారత్, అమెరికా దేశాలు 10 సంవత్సరాలపాటు అమల్లో ఉండే కొత్త రక్షణ చట్రం ఒప్పందంపై శుక్రవారం సంతకాలు చేశాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్‌సెత్‌ల మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు ఎదురుగా భారత్, అమెరికా సంయుక్త బలాన్ని పెంచే దిశగా ఇది ఒక కీలక అడుగు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు సైనిక స్థావరాలు, రవాణా, నిర్వహణ సదుపాయాలను పరస్పరం వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.